Home విద్య మ‌న ఊరు – మ‌న బ‌డి

మ‌న ఊరు – మ‌న బ‌డి

905
0

చీరాల : మ‌న ఊరు – మ‌న‌బ‌డి కార్యక్రమం రామానగరం ప్రాంతంలో కాంపెయిన్ చేస్తు తమ పాఠశాలలో రెండు ప్రొజెక్టర్లతో డిజిటల్ విద్య మరియు ఎనిమిది కంఫ్యూటర్లతో కంఫ్యూటర్ విద్య అందుబాటు ఉందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే వసతులు, ప్రభుత్వం కల్పించే ఉచిత సౌకర్యాల గురించి, ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ తో క్వాలిటీ విద్య అందుతుందని చెప్పారు. ఆత్మ విశ్వాసంతో పనిచేసే అనుభవజ్ఞులైన ఉపాద్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే  ఉన్నారని, మంచి విలువలతో కూడిన, ఒత్తిడిలేని క్రమశిక్షణతో కూడిన, ఆటపాటలతో కూడిన మంచి విద్యను అందిచడంలో మేటిగా ఉంటాయని అన్నారు. ప్రజలు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు లభించాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని పిలుపు నిచ్చారు. తద్వారా ప్రభుత్వ పధకాలైన ఉచిత విద్యతో పాటు  పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఉపకార వేతనాలు, బాలికలకు సైకిళ్ళు పంపిణి, వారానికి మూడు సార్లు గ్రుడ్డుతో మద్యాహ్న భోజన వసతి, గాలి వెలుతురులతో కూడిన విశాలమైన తరగతి గదులు, ఆటస్థలము బాలబాలికలకు ప్రత్యేక  యూరినల్స్ , టాయిలెట్స్ సదుపాయం, దూరం ప్రాంతల వారికి ఉచిత బస్ పాస్ లాంటి సౌకర్యాలను వినియోగించు కోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరావు, పుష్పరాజు, శ్రీనివాసరెడ్డి, రామాంజనిదేవి, శ్రీనివాసరావు, సబీహబేగం, హజరత్  విద్యార్ధులు పాల్గొన్నారు.