Home సినిమా ఇస్లాంకు విరుద్ధం : ప్రియా ప్రకాశ్‌పై సుప్రీంలో మరో కేసు

ఇస్లాంకు విరుద్ధం : ప్రియా ప్రకాశ్‌పై సుప్రీంలో మరో కేసు

419
0

న్యూడిల్లీ : క‌న్ను కొట్ట‌డంలో హావ‌బావాలు ప‌లికించిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌పై సుప్రీం కోర్టులో మరో కేసు నమోదైంది. ఆమె నటించిన ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రంలో ‘మాణిక్య మలరయ’ పాటలో ప్రియ కన్నుకొడుతూ పలికించిన హావభావాలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. నేటికీ వీక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తుంది. ఆ ఒక్క పాట ఆమె జీవితాన్నే మార్చేసింది. ఒక్కరోజులో స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది. అదే స్థాయిలో వివాదాలు తెచ్చుకుంది. ఆమె హావ‌బావాల‌పై కొంద‌రు కోర్టులో కేసులు వేసిన‌ప్ప‌టికీ త‌న‌పై ఎలాంటి క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దంటూ ప్రియ చేసుకున్న కౌంట‌ర్ పిటిష‌న్‌పై కోర్టు ప్రియ‌కే అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

అయితే ఈ పాట ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ గతంలో హైదరాబాద్‌కు చెందిన కొందరు ముస్లింలు ప్రియపై, దర్శకుడు ఒమర్‌ లులుపై కేసు పెట్టారు. దీనిపై ప్రియ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనపై ఎలాంటి క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా ఉండేలా చూడాలని కోరింది. ఈ కేసులో సుప్రీం తీర్పు ప్రియకు అనుకూలంగానే వచ్చింది. ఈ వివాదాల నేపథ్యంలో మార్చి 1న విడుదల కావాల్సిన సినిమా జూన్‌కు వాయిదా పడింది.

ఇదిలా ఉండ‌గా తాజాగా హైదరాబాద్‌కి చెందిన కొందరు ముస్లింలు ప్రియపై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖ‌లు చేశారు. కన్ను కొట్టడం ఇస్లాంకు వ్యతిరేకమని పిటిషన్‌లో పేర్కొన్నారు. సినిమా విడుదలకు అంగీకరించే ముందు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలని పిటిష‌న్‌లో కోర్టును కోరారు. ఈ పాట గురించి గతంలో దర్శకుడు ఒమర్‌ లులు మాట్లాడుతూ..‘1978 కాలం నుంచి కేరళలో ఈ పాట చాలా ఫేమస్‌ అయింది. అప్పట్లో లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు?’ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.