Home సినిమా ‘మమ్మల్ని చంపేస్తే మళ్లీ మళ్లీ పుడతాం..’ : ‘మెహబూబా’ ట్రైలర్‌ విడుదల

‘మమ్మల్ని చంపేస్తే మళ్లీ మళ్లీ పుడతాం..’ : ‘మెహబూబా’ ట్రైలర్‌ విడుదల

355
0

హైదరాబాద్‌: ‘మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం.. మళ్లీ మళ్లీ పుడతాం..’. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మెహబూబా’ ట్రైల‌ర్ సోమ‌వారం విడుద‌ల చేశారు. మెహ‌బూబా చిత్రంలో పూరి తనయుడు ఆకాశ్‌ కథానాయకుడుగా న‌టిస్తున్నారు. బెంగళూరు భామ నేహాశెట్టి కథానాయిక. పూరీ కనెక్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు పంపిణీ చేస్తున్నారు.

‘సరిహద్దుల్లోకి శత్రువులు వచ్చే వరకు సైనికుడ్ని ఎవరూ ప్రేమించరు’ అనే ఆకాశ్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ప్రేమకథగా ఆద్యంతం ఆసక్తికరంగా ప్రచార చిత్రాన్ని రూపొందించారు.

‘మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం.. మళ్లీ మళ్లీ పుడతాం..’ అంటూ ఆకాశ్‌ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ‘సల్మాన్‌‌ జిందాబాద్‌, షారుక్‌‌ ఖాన్‌ జిందాబాద్‌, ఆమిర్‌ ఖాన్‌ జిందాబాద్‌, అబ్దుల్ కలాం జిందాబాద్‌, ఇన్సా‌నియత్‌ జిందాబాద్‌, మొహబ్బత్‌ జిందాబాద్‌, మేరీ ‘మెహబూబా’ జిందాబాద్‌..’ అనే చివరి డైలాగ్ చూస్తుంటే నటుడిగా ఆకాశ్‌ చాలా పరిణతి చెందినట్లు తెలుస్తోంది. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధం నేపథ్యంలో సినిమాను రూపొందించారు. మే 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తనకు ఎంతో ప్రత్యేకమని పూరీ పేర్కొన్నారు.