వెబ్ డెస్క్ : టాలీవుడ్‌కు బిగ్‌బాస్ షో ద్వారా ప్రత్యేకంగా పరిచయమైన అషు రెడ్డి.. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా పాజిటివ్ గా ఉంటుంది.
టాలీవుడ్‌కు బిగ్‌బాస్ షో ద్వారా ప్రత్యేకంగా పరిచయమైన అషురెడ్డి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా పాజిటివ్ గా కమిపిస్తుంది. యాంకర్‌గా, మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా, తర్వాత బిగ్‌బాస్‌తో పాపులర్ అయ్యింది. ఇక చల్ మోహన్ రంగ వంటి సినిమాలతో తెరపై కనిపించిన ఈ బ్యూటీ.. ఇటీవలి కాలంలో పలు సోషల్ మీడియా పోస్ట్‌లతోనే అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన వీడియో ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది.
గత ఎడాది అషు ఆరోగ్య పరంగా తీవ్ర సమస్యల్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. బ్రెయిన్ సర్జరీ చేసుకున్న ఆమె ఆ విషయాన్ని ట్రీట్మెంట్ అనంతరం పెద్దగా స్పంధించలేదు. కానీ ఇపుడు మళ్ళీ ఒక వీడియో ద్వారా జీవితం గురించి ఎమోషనల్ గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతున్నారు.
అషు తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో, శస్త్రచికిత్స సమయంలో ఆమె అనుభవించిన బాధ, భయం స్పష్టంగా కనిపిస్తోంది. హాస్పిటల్ బెడ్ పై తీసిన ఆ షాట్స్, తలపై మెడికల్ బాండేజీ, షేవ్ చేసిన హెయిర్ లైన్ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రాకుండా ఉండలేవు. “ఇది L.I.F.E.. దయతో ఉండండి, భూమికి అంకితమై ఉండండి, ఇది ఎంతో మందిని బాగుచేస్తుంది” అనే క్యాప్షన్‌తో ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెటిజన్ల గుండెను తాకింది.
అంతే కాకుండా, #thankful, #journeyoflife వంటి హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా తన జీవిత ప్రయాణాన్ని ఎంతో నిబద్దతతో పంచుకుంది. ఈ పోస్ట్ చూసిన వారంతా ‘బ్రేవ్ గర్ల్’ అంటూ ఆమెను అభినందిస్తున్నారు. ఎప్పుడూ గ్లామర్ షేడ్స్‌లో కనిపించే ఆమె.. తన జీవితంలో ఇంత బాధను అనుభవించిందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అంతే కాకుండా శంకర్ దాదా సినిమాలోని ‘ఓడిపోవడం తప్పు కాదురా’ అనే లిరిక్స్ ను ఆ వీడియోకు జత చేసింది. లైఫ్ లో ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి అనేలా ఆమె ఈ వీడియోతో చెప్పకనే చెప్పింది. ఇక పలు సినిమాల్లో నటించిన అషు సోషల్ మీడియాలో గ్లామర్ కంటెంట్‌తో ఎక్కువగా ఆకట్టుకుంది. అలాగే తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఎంటర్టైన్ చేస్తూ, మిలియన్‌లలో ఫాలోయింగ్ సంపాదించుకుంది.