అమరావతి : ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ‘విద్య, ఉద్యోగాల్లో’ రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ ఉపవర్గీకరణ కింద గ్రూప్1లో 12 ఉపకులాలకు 1శాతం రిజర్వేషన్, గ్రూప్2లో 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్3లో 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని తెలిపారు.