చీరాల : బార్ అసోసియేషన్‌కు మంగళవారం ప్రతిష్టా త్మకంగా జరిగిన ఎన్నికల్లో ఐఎఎల్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అధ్యక్షులుగా గౌరవ రమేష్ బాబు (ఐఎఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్) మూడో సారి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా మేరుగ రవి కుమార్ (ఐఎఎల్ ప్రధాన కార్యదర్శి), కోశాధికారిగా నాశన రామ కోటేశ్వర రావు (ఐఎఎల్ సహాయ కార్యదర్శి), లైబ్రరీ కార్యదర్శిగా శిరిపురపు కామేశ్వరరావు (ఐఎఎల్ కార్యవర్గ సభ్యులు), ఉపాధ్యక్షులుగా విజయ్ కుమార్ విజయం సాధించారు. ఎన్నికల్లో సహాయ కార్యదర్శిగా ఎస్‌కె మస్తాన్ (ఐఎఎల్ కార్యవర్గ సభ్యులు), స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా రాజా సాల్మన్ (ఐఎఎల్ కార్యవర్గ సభ్యులు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో ఐఎఎల్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి భారత న్యాయవాదుల సంఘం కృతఙ్ఞతలు తెలిపింది. ఐఎఎల్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతిఒక్క సభ్యులకు ఐఎఎల్ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపింది.