రేపల్లె (Repalle) : చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Povan Kalyan) ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి టిడిపి (TDP), జనసేన (Janasena) నాయకులు, కార్యకర్తలు అందరూకలసి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెనాలి క్రాంతి సుమన్ అన్నారు. మండలంలోని ఉప్పూడి గ్రామంలో గురువారం శంఖారావం, బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ (Super Six) పథకాలతో పాటు మినీ మేనిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం తెనాలి క్రాంతి సుమన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను, అరాచకాలను, అన్యాయాలను వ్యతిరేకించాలని అన్నారు. ప్రజా వ్యతిరేక వైసిపి ప్రభుత్వంను సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్నీ వర్గాల ప్రజలకు ఆన్యాయం జరిగిందని అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అబద్దాలు, అభూత కల్పనలతో అధికారంలోకి వచ్చారని అన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్రం పూర్తిగా గాడితప్పి తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని అన్నారు. టిడిపి, జనసేన అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ ఉంటుందని అనగాని శివప్రసాద్ అన్నారు. కార్యక్రంలో గూడపాటి శ్రీనివాసరావు, యలవర్తి లక్ష్మి, కమతం శివ, రాజారావు, శ్యామ్ పాల్గొన్నారు.