Home ప్రకాశం చదువు అంటే మార్కులు కాదు… ఉన్నత విలువలు, జ్ఞానం, సంస్కారం చదువుతోనే సాధ్యం : డాక్టర్...

చదువు అంటే మార్కులు కాదు… ఉన్నత విలువలు, జ్ఞానం, సంస్కారం చదువుతోనే సాధ్యం : డాక్టర్ తాడివలస దేవరాజు

1219
0

చీరాల : చదువు అంటే కేవలం మార్కులు ఉద్యోగం, సంపాదనే కాదని, సామాజిక అవగాహన జ్ఞానం, ఉన్నతమైన మానవతా విలువలు, సంస్కారం వంటి అన్ని రంగాలలో చదువుకోవడం ద్వారానే ఉన్నతమైన ప్రతిభ సాధించగలమని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు అన్నారు. సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజ్ నందు ప్రిన్సిపల్ గారపాటి పుష్పరాజు అధ్యక్షతన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో దేవరాజు మాట్లాడారు. తనను గుర్తు పెట్టుకొని కళాశాలకు పిలిచి సన్మానం చేయడం, తనను ముఖ్యఅతిథిగా పిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. విద్యార్థులు అందరూ కూడా ఉన్నత స్థానానికి ఎదగాలంటే చదువుతో మాత్రమే సాధ్యం అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా చదువుతో మాత్రమే సమాజంలో మంచి గుర్తింపుని అందిస్తుందని అన్నారు. ఇప్పుడు కష్టపడి చదువుకుంటే జీవితంలో సుఖపడవచ్చని, ప్రతి ఒక్కరు చదువు మీద ధ్యాస ఉంచి చదువుకొని తల్లిదండ్రులకు, కాలేజీకి, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

కరస్పాండెంట్ శీలం విద్యాసాగర్, ప్రిన్సిపల్ గారపాటి పుష్పరాజు మాట్లాడుతూ తమ కళాశాలలో మీలాగే ఇదే బల్లలపై కూర్చొని, చదువుకొని చీరాలలో కార్పొరేట్ హాస్పిటల్ ని పెట్టి ఎంతో మందికి అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించి ప్రాణదాతగా నిలిచినటువంటి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ దేవరాజును అభినందించారు. గౌరవ డాక్టరెట్ పొందిన డాక్టర్ తాడివలస దేవరాజు తమ కాలేజీ పూర్వ విద్యార్థి అవడం తమ కాలేజీకి ఎంతో గర్వకారణమని అన్నారు. డాక్టర్ దేవరాజుని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు విద్యార్థులు చేరాలని తెలిపారు.

కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది మంజుల, సుమ, చినపాప, పార్వతి, షిలా, ఖాద్రి, షిపోరా మరియు బోధనేతర సిబ్బంది లక్ష్మయ్య, వై వినీల, జి నిలిమ, డి జార్జ్ విన్సెంట్, జె జ్యోతి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.