Home ప్రకాశం కిడ్నీ జబ్బులకు చీరాల శ్రీ కామాక్షి హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి సంరక్షణ

కిడ్నీ జబ్బులకు చీరాల శ్రీ కామాక్షి హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి సంరక్షణ

415
0

– ఆపరేషన్‌ లేకుండా లేజర్ ఆల్టర్ సౌండ్ వీవెస్ ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించబడును.
– చీరాలలో మొట్టమొదటిసారిగా ప్రవేట్ హాస్పిటల్ నందు అందుబాటులో డయాలసిస్ సేవలు
చీరాల : డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా శ్రీకామాక్షి కేర్‌ హాస్పిటల్‌ నందుకు కిడ్నీ జబ్బులకు పూర్తి ఉచిత వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ తాడివలస దేవరాజు తెలిపారు. డయాలసిస్ మరియు కిడ్నీలో రాళ్లకు, కిడ్నీ సంబంధిత ఆపరేషన్లకు డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలను తమ హాస్పిటల్‌ నందుకు ఈనెల 17న ఆదివారం 11 గంటలకు చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కరణం వెంకటేష్ బాబు చేతుల మీదగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో శుక్రవారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. చీరాలలోనే డైలసిస్, అన్ని రకాల ఎముకల ఆపరేషన్‌లు, జనరల్ మరియు లాప్రోస్కోపి ఆపరేషన్‌లు, కిడ్నీ రాళ్ల ఆపరేషన్‌లు, చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్‌లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఎముకల ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ వైద్య సేవలో ఉచితంగా చేస్తామన్నారు. పేషెంట్ చేరిన 24గంటల్లోపే ఆపరేషన్‌కు సంబంధించి పర్మిషన్‌ను ట్రస్ట్ అందజేస్తుందని తెలిపారు. బాపట్ల, పర్చూరు, చీరాల నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ ముఖేష్‌రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ లక్ష్మీనారాయణ, హాస్పటల్ జీయం తాడివలస సురేష్, ఆరోగ్యమిత్ర అనిల్, బోయాజ్, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.