– సేవ మూర్తులు మరింత మంది ముందుకు రావాలన్న వెంకటేష్ – శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సేవలు అభినందనీయం – రోటరీ క్లబ్ క్షీరపురి ప్రజలకు ఏప్పుడు అండగా ఉంటుంది – పేదలకు సేవ చేయడమే లక్ష్యం : తాడివలస దేవరాజ్ చీరాల : కష్టాలలో ఉన్న వారిని గుర్తించి సహాయం చేయటంలో ముందుండే శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ యండి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ప్రెసిడెంట్ తాడివలస దేవరాజు శుక్రవారం చీరాల ఏరియా వైద్య శాలకు ప్రకాశం జిల్లా వైసీపీ యువనాయకులు కరణం వెంకటేష్ చేతులమీదుగా మున్సిపల్ కార్యాలయంలో 500డిస్పోజబుల్ బెడ్ షీట్ లు బహుకరించారు. ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శేషు కుమార్ కు బెడ్ షీట్స్ అందజేశారు.
కరణం వెంకటేష్ మాట్లాడుతూ సీఎం జగన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలు చేస్తున్నప్పటికీ దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వ హాస్పిటల్ కు సహాయ సహకారాలు ఆందివ్వటం శుభ పరిణామమని అన్నారు. కొవిడ్ మహమ్మరి విలయతాండవం చేస్తుండటంతో ప్రతి ఒక్కరు సేవా దృక్పదంతో ముందుకు వచ్చి తమ వంతుగా సహాయ సహాకారాలు అందించాలని కోరారు. దేవరాజును అబినందించారు.
ఈ సందర్బంగా శ్రీ కామాక్షికేర్ హస్పిటల్ ఏండి తాడివలస దేవరాజ్ మాట్లాడుతూ చీరాల ప్రాంతంలోని పేదలకు తన వంతు సహాయ సహాకారాలు ఎల్లవేళలా అందిస్తానని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. కరణం వెంకటేష్ బాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేయటం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని అన్నారు. ఇలాంటి సేవాకార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాన్నారు.
ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శేష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి వారు బెడ్ షీట్స్ అందించడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపాల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, కౌన్సిలర్లు మించాలా సాంబశివరావు, కీర్తి వెంకట్రావు, ఉల్లిపాయల సుబ్బయ్య, బత్తుల అనిల్, వైసిపి నాయకులు పేర్లి నాని, మళ్లి రామకృష్ణ, డాక్టర్ సురేష్, నర్సింగ్ సిబ్బంది, రోటరీ క్లబ్ క్షీరపురి సభ్యులు పాల్గొన్నారు.