కందుకూరు : పట్టణంలోని 14మసీదుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి కోరారు. సింగరాయకొండకు చెందిన వైస్సార్సీపీ యువ నాయకుడు దొడ్డా మహీధర్‌రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి సమక్షంలో మసీదుల అభివృద్ధి కమిటీ సభ్యులైన షేక్ మహబూబ్‌భాష, షేక్ ఖాదర్ భాషాకు రూ.10,116 అందజేశారు.
ఈ సందర్భంగా దొడ్డ మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంఎల్ఎ మహీధర్‌రెడ్డి పట్టణంలో దేవాలయాలు, మసీదుల అభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో తన వంతు సహాయంగా రూ.10,116అంద చేసినట్లు తెలిపారు. ముస్లిం సోదర, సోదరీ మణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. విరాళం అందజేసిన దొడ్డ మహీధర్‌రెడ్డికి మసీదుల కమిటీ సభ్యులు షేక్ మహబూబ్ బాషా, షేక్ ఖాదర్ బాషా ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో పెద్దలు, మిత్రులు పద్మనాబుని సురేష్, పబ్బిశెట్టి శివ, లింగారెడ్డి సతీష్‌రెడ్డి, వికృతి తిరుపతిరావు, మోటుపల్లి గోపి, షేక్ షబ్బీర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు అన్నలూరి వెంకటేశ్వరరావు, తేజ జ్యువలర్స్ అధిపతి వెంకటరెడ్డి, వైస్సార్సీపీ నాయకులు తోకల కొండయ్య, కొండూరు వసంతరావు, సూరం వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.