Home ప్రకాశం బీసీలు, మహిళలు అన్నీ రంగాలలో రాణించాలి : డాక్టర్ సుబ్బారావు, తాడివలస దేవరాజు

బీసీలు, మహిళలు అన్నీ రంగాలలో రాణించాలి : డాక్టర్ సుబ్బారావు, తాడివలస దేవరాజు

284
0

చీరాల : వడ్డెర సంఘం నాయకులు వల్లెపు వేణు యొక్క మిత్ర బృందం ఆధ్వర్యంలో చీరాల, పేరాల శ్రీ వేంకటేశ్వర వడ్డెర సంక్షేమ సంఘం తరుపున వివిధ సేవా రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను సత్కరించారు.

ఈ సందర్భంగా చీరాల రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు, హైమ హాస్పిటల్ అధినేత డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, శ్రీ కామాక్షి కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండీ తాటివలస దేవరాజు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు గుంటి శ్రీనివాసరావు, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు భక్తుల భూలక్ష్మీని ఘనంగా సత్కరించారు.

డాక్టర్ హైమా సుబ్బారావు మాట్లాడుతూ గతంలో తల్లి రక్షణలో కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు సమాజం ఎంతో బాగుందని అన్నారు. పిల్లల చదువుపై తల్లి ప్రత్యేక శ్రద్ధను వహించాలని అన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని అన్నారు. తాడివలస దేవరాజు మాట్లాడుతూ ఒక కుటుంబం సామాజికంగా అభివృద్ధి సాధించాలంటే చదువుతో మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లల చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. చేతి వృత్తులు చేసుకునే వారు టెక్నాలజీ ఉపయోగించుకుంటూ పనిలో నైపుణ్యం పెంచుకోవాలని తెలిపారు.