చీరాల : వైసిపి చేనేత విభాగం ఆధ్వర్యంలో చేనేత సమస్యలపై అధ్యయన సదస్సు ఆదివారం చీరాలలో నిర్వహించారు. చేనేత వృత్తి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన పథకాలు వంటి అంశాలపై చర్చించారు. సదస్సులో వైసిపి చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, అధ్యయన కమిటీ రాష్ట్ర కార్యదర్శి అవ్వారు ముసలయ్య, వైసీపీ చీరాల నియోజకవర్గ ఇంచార్జ్ యడం బాలాజీ, వైసిపి చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి బీరక సురేంద్ర, ఉపాధ్యక్షుడు గిరిరాజు నరేష్, వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మారెడ్డి, అధ్యయన కమిటీ సభ్యులు హెచ్ బి నర్షీగౌడ్, తొందమల్లి పుల్లయ్య, సుగుమంచిపల్లి రంగన్న, బాపట్ల పార్లమెంట్ ఇంచార్జ్ నందిగం సురేష్, వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, మాజీ ఎంపీ చిమట సాంబు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కర్నేటి ప్రసాద్, పెడన మునిసిపల్ ఛైర్మన్ బండారు ఆనంద ప్రసాద్ పాల్గొన్నారు.