చీరాల : ఈపూరుపాలెంలోని రావిచెట్టు ప్రాంతంలో వైఎస్ఆర్‌సిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి యడం బాలాజీ ఇంటింటికీ తిరిగి ప్రజలను కలిశారు. వైఎస్ఆర్‌సిపి చేపట్టనున్న తొమ్మిది ప్రజాసంక్షేమ పథకాలు వివరించారు. రాజన్న సంక్షేమ రాజ్యం కోసం జగన్‌ను స్వాగతించాలని కోరారు. వైసిపి కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ” రావాలి జగన్ – కావాలి జగన్ “ అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో పర్యటించారు. ఆయన వెంట వైసిపి గ్రామ అధ్యక్షులు గుద్దంటి సుధాకర్, ఎంపిటిసి గోలి ఆనందరావు, నాయకులు గోలి వెంకట్రావు, చీరాల రూరల్ అధ్యక్షులు రామకృష్ణ, అధికార ప్రతినిధి యడం రవిశంకర్, పాతచీరాల సర్పంచి రాజు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.