Home బాపట్ల నాణ్యతతో వారంలో పనులు పూర్తి చేయాలి

నాణ్యతతో వారంలో పనులు పూర్తి చేయాలి

15
0

బాపట్ల (DN5 News) : ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగు దొడ్లు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న సామాజిక మరుగుదొడ్ల భవన సముదాయాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల అవసరార్ధం మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు అసౌకర్యం లేకుండా మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

స్వచ్ఛభారత్ కార్పొరేషన్ నుంచి రూ.21లక్షలు, డిఎంఎఫ్ నిధి నుంచి రూ.9 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. రూ.30లక్షల నిధులతో నిర్మిస్తున్న 20 మరుగు దొడ్లు, 20 యూరినల్స్, సింక్‌లు, కుళాయి కనెక్షన్లు, నీటి వసతి పరిశీలించారు. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, యూరినల్స్ ఏర్పాటు చేయడాన్ని పరిశీలించారు. ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలతో పనులు ఉండాలని సూచించారు. భవన సముదాయంలో ఎగ్జిస్టెడ్ ఫ్యాన్ల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. భవన సముదాయానికి బోర్డు, ప్రహరీ గోడ వెలుపల వైపు చిత్రాలు వేయించాలని, వారంలో పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ అనంతరాజు, డీఈ, ఎఇ, గుత్తేదారుడు ఉన్నారు.