Home గుంటూరు ఎంఎల్సి అన్నం చొరవతో కొమ్మమురు కాల్వకు నీళ్లు

ఎంఎల్సి అన్నం చొరవతో కొమ్మమురు కాల్వకు నీళ్లు

333
0

బాపట్ల : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చివరి భూములకు సాగునీటిని అందించాలని ఎంఎల్సి అన్నం సతీష్ ప్రభాకర్‌ అధికార్లుతో చర్చించారు. ఎంఎల్సి ప్రతిపాదన మేరకు కోమ్మూరు కాలువకు 3000క్యూసెకులు, నిజాంపట్నం కాలువకు 600 క్యుసెకుల నీరు సరఫరా చేసేందుకు అధికారులు అంగీకరీంచినట్లు టిడిపి నాయకులు తెలిపారు. చివరి భూముల వరకు నీరు పంపించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలపై నీటిపారుదల శాఖ జెఈ వి పవన్ తో టిడిపి మండల అధ్యక్షులు గోకరాజు శ్రీధర్ వర్మ, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు రావిపూడి నాగమల్లేశ్వరరావు, నీటి సంఘం అధ్యక్షులు సుబ్బరాజు చర్చించారు.