Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు… జగన్… ఈ రాష్ట్రం ఏమైనా మీ అబ్బ జాగీరా? : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి...

చంద్రబాబు… జగన్… ఈ రాష్ట్రం ఏమైనా మీ అబ్బ జాగీరా? : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

378
0

యర్రగొండపాలెం : “చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు… ఆయన తర్వాత ఆయన కొడుకు సీఎం సీట్లో కూర్చోవడానికి రెడీ అయ్యాడని. అమెరికాలో చదువుకుని వచ్చాడని… రాజశేఖరరెడ్డికి వారసునిగా సీఎంని చేయాలని జగన్ మరోవైపు తిరుగుతున్నాడు. మెమడుగుతున్నాం. ఈ రాష్ట్రమేమైనా మీ అబ్బ జాగీరా? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక రాచరికంలో ఉన్నామా? ఏం చేశారు… మీరు… మాబ్రతుకులేమైనా మార్చారా? అనంతపురం నుండి వస్తున్నాం. ఎక్కడ… ఏమి… మారలేదు.” అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అధికార పార్టీ నేత చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాటల తూటాలు పేల్చారు. అనంతపురం నుండి ప్రారంభమైన సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక బస్సు యాత్ర ఆదివారం సాయంత్రం యర్రగొండపాలెం చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు.