చీరాల : శ్రీనివాస నగర్లో మంగళవారం రాత్రి విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 9480లీటర్ల తెల్లఆరోమేటిక్ స్పిరిట్ ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని రంగుల అద్దకం, పెయింట్ లలో వాడతారు. రంగుల అద్దకం పరిశ్రమల యజమానులు ప్రభుత్వ అనుమతులతో పరిశ్రమ అవసరాల మేరకు తెచ్చుకుని నిల్వ ఉంచుకుంటారు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా పరిమితికి మించి వేల లీటర్ల నిల్వ ఉంచడంపై విజిలెన్స్ అధికారులు సమాచారం అందింది. పక్కా సమాచారంతో అధికారులు దాడులు చేశారు. దాడిలో 9480లీటర్ల స్పిరిటను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిల్వ ఉంచిన శిఖాకొల్లి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. దాడుల్లో విజిలెన్స్ అధికారి టీఎక్స్ అజయ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు. స్వాదినం చేసుకున్న స్పిరిటను చీరాల తహశీల్దారుకు అప్పగించారు.
ప్రమాదకరం….
చీరాలలో సాంప్రదాయ రంగుల అద్దకం పరిశ్రమలతోపాటు గత నాలుగేళ్లుగా మేకనైజ్డ్ డైయింగులు వచ్చాయి. వీటిలో ఒక్కరోజులో లక్షల లీటర్ల రసాయనాలతో కూడిన మురుగు నీరు వదిలేస్తున్నారు. వీటిలో ఈ స్పిరిట్ వాడతారు. రంగుల అద్దకంతోపాటు పెయింట్ తయారిలోను స్పిరిట్ వాడతారు. షామియానా తయారీ కంపినీల్లోనూ వాడతారు. రంగుల అద్దకం పరిశ్రమలో వాడే రసాయనాలు సాధారణంగా పెద్దమొత్తంలో నిల్వ ఉంచుకుంటే ప్రమాదాన్ని పక్కన పెట్టుకున్నట్లే. అందుకే వీటిని నివాసాలు దూరంగా అనుమతిస్తారు. సాంప్రదాయ పరిశ్రమలు ఏడాదిలో చేసే కాలుష్యాన్ని మెకానికల్ డైయింగులు నెలలోనే కలుషితం చేస్తాయి. అందుకే వీటిని తమిళనాడులో నిషేధించారు. కానీ వ్యక్తిగత ఆదాయ వనరుగా చేసుకున్న మనవాళ్ళు మాత్రం ఉపాధి వనరుగా చూపి అనుమతించారు. ఇప్పటికైనా కాలుష్య నియంత్రణాధికారులు వీటిపై చర్యలు తీసుకుని పర్యావరణాన్ని, వీటిపై ఆదాయం చూసుకుని అక్రమ నిల్వలు చేసేవారిని నియంతరించాల్సి ఉంది.