పర్చూరు : ప్రముఖ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణ నాయనమ్మ విక్రమ్ సరస్వతమ్మ మృతి పట్ల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సంతాపం తెలిపారు. ఆమె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సరస్వతమ్మ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని అన్నారు. గ్రామ, సమాజ అభివృద్ధికి సరస్వతమ్మ కృషి మరువలేనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఏలూరి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడుని ప్రార్థించారు.