Home ప్రకాశం ర్యాంకుల పంట పండించిన విజ్ఞాన భార‌తి

ర్యాంకుల పంట పండించిన విజ్ఞాన భార‌తి

502
0

చీరాల : విజ్ఞాన భార‌తి జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్ధులు 2017-18 విద్యాసంవ‌త్స‌రం ఫ‌లితాల్లో ర్యాంకుల పంట పండించారు. మొన్న విడుద‌లైన ఇంట‌ర్ ఫ‌లితాల్లో 988మార్కుల‌తో జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విజ్ఞాన భార‌తి జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్ధులు జెఇఇ, ఎంసెట్‌లోనూ ర్యాంకులు సాధించి కార్పోరేట్ కాలేజీల‌కు ధీటుగా నిలిచారు. వేల సంఖ్య‌లో విద్యార్ధులుండే కార్పోరేట్ కాలేజీల్లో ఒక్క‌రికి ర్యాంకు వ‌స్తే రాష్ట్ర‌మంతా అన్ని బ్రాంచిల్లో ప్ర‌చారం చేసుకుటుండ‌గా ఎక్క‌డా బ్రాంచిలు లేకుండా ఉపాధి కేంద్రంగా గ‌త 28ఏళ్లుగా నిర్వ‌హిస్తున్న చీరాల విజ్ఞాన భార‌తి జూనియ‌ర్ క‌ళాశాల విద్యార్ధులు ప్ర‌తిఏటా కార్పోరేట్ కాలేజీల‌కు ధీటైన ఫ‌లితాలు సాదిస్తూ స‌త్తా చాటుతున్నారు. ఎప్ప‌టిలాగానే ఈ ఏడాది కూడా ఫ‌లితాలు సాధించ‌డంలో త‌మ‌కు తామే సాటి అని నిరూపించుకున్నారు. క‌ళాశాల‌కు చెందిన ఎస్ విజ‌య‌గ‌ణేష్ 1321ర్యాంకు సాధించి క‌ళాశాల ప్ర‌ధ‌మ స్థానంలో నిలిచాడు. అత‌నితోపాటు ఎన్ నాగ‌సాయిప‌వ‌న్‌కుమార్ (2799), జి హిమ‌సాయికిర‌ణ్ (4146), ఎం కీర్త‌న (7647), సిహెచ్ నిఖిల (7678), మ‌రోవిద్యార్ధి (8399) ర్యాంకులు సాధించారు. ఈసంద‌ర్భంగా క‌ళాశాల సెక్ర‌ట‌రీ అండ్ క‌ర‌స్పాండెంట్ డాక్ట‌ర్ మేజ‌ర్ తోట రోశ‌య్య మాట్లాడారు. విద్యార్ధుల‌ను అభినందించారు. ఏ ప‌రీక్ష నిర్వ‌హించినా ఫ‌లితాలు సాధించ‌డంలో విజ్ఞాన భార‌తి విద్యార్ధులు ముందు వ‌రుస‌లో ఉంటార‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ జంపాల గంగాధ‌ర‌రావు, అక‌డ‌మిక్ డైరెక్ట‌ర్ జి రామాంజ‌నేయులు, ప్రిన్సిపాల్ పి నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు.