చీరాల (DN5 News) : బిసి నాయకులు బచ్చు వెంకట రమణ మృతి బాధాకరమని శాసన సభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక ఏరియా వైద్యశాల మార్చురీలో ఉనన వెంకటరమణ మృత దేహాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. పోలీసు సిబ్బందిని అడిగి అతని మరణానికి కారణమైన రోడ్డు ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనో ధైర్యంతో ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మన్ మించాల సాంబశివరావు, ఎఎంసి ఛైర్మన్ కౌతరపు జనార్ధనరావు, ఇతర నాయకులు ఉన్నారు.






