Home ప్రకాశం కొండపిలో ఘర్షణ – వరికూటి వర్సెస్ వెంకయ్య

కొండపిలో ఘర్షణ – వరికూటి వర్సెస్ వెంకయ్య

648
0

కొండెపి : అనుకున్నంతా అయ్యింది. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. వైఎస్సార్ సీపీ అధినేత తీసుకున్న నిర్ణయం ఇరువర్గాలను గొడవలకు దారితీసేలా పురికొల్పాయి. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఒకవైపు వరికూటి అశోక్ బాబు మరోవైపు తాజా ఇంచార్జ్ పదవికి నియమితులైన డాక్టర్ వెంకయ్య పోటాపోటీగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇద్దరి నేతల వెంట కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్నప్పటికి ఆదివారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల కార్యకర్తలు రక్తం కారెంతగా కొట్టుకున్నారు. ఇంత గొడవను పోలీసులు అదుపు చేశారు. గొడవలకు ఆజ్యం పోసిన నాయకులెవ్వరు కనిపించకపోవడం వైసిపి జిల్లా, రాష్ట్ర నాయకత్వం విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది.