వేటపాలెం (DN5 News) : స్థానిక సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఆధునికి సాంకేతికత, పరికరాలు ఉపయోగించి భూముల సర్వే చేసే విధానంపై విద్యార్ధులకు వారం రోజులపాటు శిక్షణ ప్రారంభించినట్లు కళాశాల సెక్రటరి వనమా రామకష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 16 నుండి వారం రోజుల పాటు బిటెక్ విద్యార్ధులకు అప్లికేషన్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టూల్స్ ఇన్ ల్యాండ్ సర్వేపై వర్క్ షాపు ప్రారంభించినట్లు ప్రిన్సివాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు.
ఈ వర్క్ షాపును విజయవాడ యునిక్ సర్వే సొల్యూషన్స్ సహకారంతో టి ప్రేమ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ వర్క్ షాపులో అధునాతన ల్యాండ్ సర్వే టూల్స్ అయిన టోటల్ స్టేషన్, ట్రింబుల్, జియోమాక్స్, డిజిపిఎస్ పరికరాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించి వాటిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ ప్రపంచంలో ల్యాండ్ సర్వే ఎంతో ప్రాముఖ్యత వహిస్తున్నదని అన్నారు. విద్యార్ధులు సర్వే టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలని కోరారు. దీనిపై దష్టిని పెట్టి నేర్చుకుంటే ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఈ వర్క్ షాపు ప్రారంబోత్సవ సభలో డైరెక్టర్లు డాక్టర్ సి సుబ్బారావు, వనమా దొర నాగ సాయినాద్ పాల్గొన్నారు.






