చీరాల : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్ధులకు ఆకలి తీర్చే పథకాన్ని 100రోజులపాటు నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ ఎస్ కొండలరావు పేర్కొన్నారు. ఎన్ఆర్ అండ్ పిఎం, కెజిఎం ఉన్నత పాఠశాలల విద్యార్ధులకు సత్యసాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో అల్పాహారం అందించే కార్యక్రమానికి 100రోజులైన సందర్భంగా కెజిఎం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అల్పాహార కార్యక్రమాన్ని ప్రతిఏటా నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వెంకటేశ్వరబాబు తెలిపారు. అన్నదానం చాలా గొప్పదని న్యాయవాది బండారుపల్లి హేమంత్‌కుమార్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు ఊటుకూరి సుబ్బారావు, చుండూరి సురేంద్ర, సుబ్బయ్య, బాల, శేఖర్, వెంకటకృష్ణ, చార్టెడ్ అకౌంటెంట్ వంగర శ్రీధర్, ఉపాధ్యాయులు పవని భానుచంద్రమూర్తి, ఎంఎస్ వరప్రసాద్, జయచంద్రబాబు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.