•అత్యవసర వైద్యానికి ఎమ్మెల్యే ఏలూరి వెన్నుదన్ను
•అత్యవసర వైద్య చికిత్సలకు తక్షణ స్పందన
•3కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం
•ఎల్ఓసి ద్వారా రూ.9.89 లక్షలు మంజూరు
పర్చూరు (DN5 News) : ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయం తలుపుతట్టిన మూడు కుటుంబాలకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆశాకిరణంగా నిలిచారు. బాధితుల ఆవేదనను వ్యక్తిగతంగా స్వీకరించి ప్రభుత్వంతో సమన్వయం చేసి సిఎం సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా ఎల్ఓసి మంజూరు అయ్యేలా తక్షణ చర్యలు చేపట్టారు. క్యాన్సర్, గుండె సంబంధిత, బేబీ అత్యవసర వైద్య అవసరాల కోసం రూ.9.89 లక్షల ఆర్థిక సహాయం అందేలా చేశారు. దీంతో చికిత్సకు మార్గం సుగమమైంది. ఆందోళనలో ఉన్న కుటుంబాలకు భరోసాగా ధైర్యం కల్పించారు. ప్రజల ఆపదను తన బాధ్యతగా భావించిన ప్రజాప్రతినిధి స్పందన, ప్రభుత్వం, ప్రజాప్రతినిధి సమన్వయం కలిసి మూడు కుటుంబాలకు ఆసరాగా, వెన్నుదన్నుగా నిలిచారు.
మార్టూరు, కారంచేడు మండలాల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురు బాధితులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మానవీయంగా స్పందించి సిఎం సహాయనిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా ఎల్ఓసి (లెటర్ ఆఫ్ క్రెడిట్) కింద రూ.9,89,847ల ఆర్థిక సహాయం మంజూరు చేయించారు.
క్యాన్సర్ బాధితురాలికి రూ.6 లక్షల మంజూరు
కారంచేడు గ్రామానికి చెందిన పోతిని విజయలక్ష్మి క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ అత్యవసర చికిత్స అవసరమైన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ ఆర్థిక స్థితి బలహీనంగా ఉండటంతో స్థానిక నాయకులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెంటనే స్పందించి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసి కింద రూ.6 లక్షల చెక్కును మంజూరు చేయించారు. దీంతో కుటుంబానికి గణనీయమైన ఊరట లభించింది.
గుండె చికిత్సకు రూ.2 లక్షలు
మార్టూరు మండలం నాగరాజుపల్లికి చెందిన సోమల ఆంజనేయులు గుండె సంబంధిత అత్యవసర చికిత్స కోసం సహాయం కోరగా ఎమ్మెల్యే సిఫారసుతో రూ.2 లక్షల ఎల్ఓసి మంజూరైంది. అవసరమైన వైద్యం అందుకునేందుకు ఈ సహాయం దోహదపడింది.
చిన్నారికి వైద్య సహాయం రూ.1.89 లక్షలు
మార్టూరు మండలం ద్వారకపాడు గ్రామానికి చెందిన పాలపర్తి శారద కుమార్తెకు అత్యవసర వైద్య చికిత్స అవసరమవడంతో ఎమ్మెల్యే ఏలూరి సిఫారసుతో రూ.1,89,847 ఎల్ఓసి చెక్కు మంజూరు చేయించారు.
మానవీయ దృక్పథంతో సేవలు
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆపద సమయంలో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా మరింత సహాయం అందేలా కృషి కొనసాగిస్తామని తెలిపారు. అత్యవసర సమయంలో అందిన ఈ ఆర్థిక సహాయం కుటుంబాలకు ఆశాకిరణంగా మారింది. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే సేవలను స్థానికులు అభినందించారు. స్థానిక నాయకులు కామేపల్లి హరిబాబు, మిన్నకంటి రవి, పెంట్యాల శరత్, పర్వతాలు, శ్రీరామ్ మూర్తి, రామకృష్ణ, క్యాంపు కార్యాలయ ప్రతినిధులు చెక్కులను అందజేశారు.






