చీరాల : తెలుగును గ్రాంధికం నుండి వాడుకబాషగా మలచడంలో విశేష సేవలందించిన గిడుగు రామమూర్తి పంతులు 155వ జయంతి సందర్భంగా తెలుగు బాషా దినోత్సవాన్ని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. మన తెలుగు – వెలుగు పేరుతో పలువురు తెలుగు సాహితీ వేత్తల సేవలను మున్సిపల్ కమీషనర్ షేక్ ఫజులుల్లా, కోట వెంకటేశ్వరరెడ్డి వివరించారు. కార్యక్రమంలో చుక్కపల్లి రామకోటయ్య, గాదె హరిహరరావు, లక్కాకుల వల్లయ్య, పుసులూరి సత్యనారాయణ, అత్తులూరి రామారావు, బొడ్డు సంజీవరావు, డిఇ గణపతి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
కొత్తపేట జెడ్‌పి ఉన్నత పాఠశాలలో తెలుగు బాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా తెలుగు బాషా గేయాలు ఆలపిస్తూ చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. కవితలు, పాటలతో తెలుగు బాష మాధుర్యాన్ని విద్యార్ధులకు వివరించారు. ఈసందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు డి సుభద్రను పాఠశాల అభివృద్ది కమిటి ప్రతినిధులు సన్మానించారు. మాతృబాషను నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొన్నారు. వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖన, పద్యపఠన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ ఇందిరా ఇజ్రాయేల్, అభివృద్ది కమిటి అధ్యక్షులు గవిని నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఎస్‌జిడి ఖురేషి, బండి బిక్షాలుబాబు, అరుణకుమారి, విజయలక్ష్మి, ఎన్ శ్రీనివాసరావు, బాలకృష్ణ, ఫణిసత్యనారాయణ, బుర్ల వెంకటేశ్వర్లు, కె రవి, ఎన్ రవీంద్రబాబు, హనుమంతరావు, పవని భానుచంద్రమూర్తి పాల్గొన్నారు.