చీరాల : ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు కోరుతూ ఈ నెల 18న ఛలో అసెంబ్లీ పిలుపునిచ్చారు. శాసనసభ సమావేశాలు జరగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల ర్యాలీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉపాధ్యాయుల ఆందోళనను భగ్నం చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. పోలీసులను ప్రయోగించి అణచివేసేందుకు అరెస్టులు పురమాయించింది. రాత్రి పొద్దుపోయాక ఉపాధ్యాయ నేతల పూచీకత్తుపై విడుదల చేశారు. రెండోపట్టణ స్టేషన్లో ఫ్యాప్టో నాయకులు కె వీరాంజనేయులు, బండి బిక్షాలుబాబు, కె సుబ్బారావు, ఈపురుపాలెం స్టేషన్లో జి సూరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విడుదల చేశారు.