Home ఆంధ్రప్రదేశ్ మిత్ర ధర్మాన్ని పాటించాలి : దివి శివరాం 

మిత్ర ధర్మాన్ని పాటించాలి : దివి శివరాం 

648
0

కందుకూరు : విబజన చట్టం లో ఉన్న అంశాల అమలు విషయంలో మాత్రమే తాము కేంద్రాన్ని అడుగుతున్నామని మాజీ ఎంఎల్ఎ దివి శివ‌రామ్ పేర్కొన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా చేస్తాం, చూస్తాం కాలం నెట్టుకొచ్చారుత‌ప్ప ఏమీ చేయ‌లేద‌న్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు మన స్సాక్షి లేకుండా మౌనంగా ఉన్నారని ఆరోపించారు. మిత్ర పక్షం తన మిత్ర ధర్మాన్ని పాటించాల్సిందేన‌న్నారు. స్థానిక తెలుగువిజయం ప్రాంగణంలో జరుగుతున్న 156 బాచ్ శిక్ష‌ణ‌ ముగింపు కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. నాడు కాంగ్రెస్, బీజేపీ కలసి విబజన బిల్లును పాస్ చేయించారన్నారు. నాడు ఆదుకుంటాం అని చెప్పిన బీజేపీ నేడు నిలువునా మోసం చేస్తుందని అన్నారు. నాడు పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ప్రజలు మనకు ఓటు వేసారని, జవాబుదారి పాలన ఇవ్వాలని పేర్కొన్నారు. జవభుదరీ తనం బీజేపీ ప్రభుత్వం నిలుపుకోవాలన్నారు.

రాష్ట్రంలో బాధ్యత లేని ప్రతి పక్షం ఉందని, రాష్ట్ర అబివృద్దికి చంద్రబాబు అనునిత్యం కష్టపడుతుంటే, ప్రతి పక్షం చంద్రబాబు ను విమర్శించడమే తప్ప, రాష్ట్ర ప్రయోజల కోసం కృషి చేయడం తెలియదన్నారు. అటువంటి ప్రతిపక్ష నేతగా జగన్ ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టమ‌న్నారు.   గ్రామ స్థాయిలో  అందరిని కలుపుకుంటూ పార్టీ కార్యక్రమాలను చంద్రబాబు ఆదేశాల‌కు అనుగుణంగా కార్య‌క‌ర్త‌లు ప‌నిచేయాల‌న్నారు. రానున్న సాధారణ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తిరిగి టిడిపికి పట్టం కట్టేవిధంగా సంక్షేమ పధకాల అమలులో పతి కార్యకర్త  బాగస్వామి కావాలని కోరారు. అనంతరం పోటీలలో విజేతలకు బహుమతులు, శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్స్ అందజేసారు. శిక్షణకు గుంటూరు జిల్లా వేమూరు, తెనాలి, వినుకొండ, గురజాల,  ప్రకాశం జిల్లా కనిగిరి, మార్కాపురం, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజక వర్గాల నుండి  గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శిక్షణ శిభిరం సిబ్బంది కాకర్ల  మల్లికార్జున్, పాపారావు పసుపులేటి, చైతన్య, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.