Home గుంటూరు టిడిపి పాల‌న‌లోనే మహిళలకు సముచిత స్థానం : ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్

టిడిపి పాల‌న‌లోనే మహిళలకు సముచిత స్థానం : ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్

445
0

బాప‌ట్ల : టిడిపి పాల‌న‌లోనే మహిళలకు సముచిత గౌరవం దక్కుతుందని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. స్థానిక కాపు కల్యాణ మండపంలో వెలుగు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బాపట్ల మండల సాధికార మిత్రల అవగాహన స‌భ‌లో ఆయన మాట్లాడారు. మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నో పధకాలు ప్రవేశ పెట్టారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో ముందుగా దేశంలో వినూత్నంగా డ్వాక్రా వ్యవస్థకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. డ్వాక్రా రుణ మాఫీ మహిళల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు.

ప్రతి సాధికార మిత్ర ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాల‌ని చెప్పారు. ప్రతి ఒక్కరూ లబ్ది పొందేవిధంగా కృషి చేయాలని కోరారు. రానున్న రోజుల్లో ప్ర‌భుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంద‌న్నారు. సాధికార మిత్రాలందరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. సాధికార మిత్రగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ గుర్తింపు ఉంటుందని తెలిపారు. అనంతరం బాపట్ల మండల సాధికార మిత్రలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు రావిపూడి నాగమల్లేశ్వరరావు, టిడిపి మండల అధ్యక్షులు కావూరి శ్రీనివాసరెడ్డి, బడుగు నాగేశ్వరరావు, వెలుగు ఎపియం లక్ష్మీ కుమారి, ఎంపీటీసీలు నిర్మల, మల్లీశ్వరి, నాగభూషణం, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.