Home వైద్యం షుగ‌రును అదుపులో ఉంచుకుంటేనే : శ్రీ‌కామాక్షి కేర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డి

షుగ‌రును అదుపులో ఉంచుకుంటేనే : శ్రీ‌కామాక్షి కేర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డి

562
0

చీరాల : షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే కళ్ళు , గుండె, కిడ్నీ జబ్బులు, పక్షవాతం వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నందున‌ ఒక్కరు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవాల‌ని ప్రముఖ జనరల్ ఫిజీషియన్, షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. నవంబర్ 14న ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో జ‌రిగిన‌ షుగర్ వ్యాధి అవగాహన సదస్సు, ఉచిత వైద్య శిబిరం మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ తాడివలస దేవరాజు అధ్యక్షతన నిర్వ‌హించారు. స‌ద‌స్సులో డాక్టర్ గడ్డం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వలన, ఒత్తిడితో కూడినటువంటి జీవనం వలన షుగర్ వ్యాధి బారిన ప్రజలు పడుతున్నారని చెప్పారు. చెవి, ముక్కు, గొంతు స్పెషలిస్ట్ డాక్టర్ పలుకూరు సురేష్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు చెవిలో చీము కారుటను నిర్లక్ష్యం చేయకూడ‌ద‌న్నారు. గొంతులో మింగుడు పడక పోవడం వంటి సమస్యలు వస్తే ఇఎన్‌టి స్పెషలిస్ట్ ను కలవాలని సూచించారు.

ప్రముఖ జనరల్, లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ గవిని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ షుగర్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా చెప్పులు, బూట్లు వేసుకోకుండా నడవకూడదని చెప్పారు. ప్రతి రోజు పాదాలను గమనించుకో వాలని సూచించారు. ఎలాంటి చిన్న గాయమైనా దానికి చికిత్స చేయించుకోవాలని తెలియజేశారు. ఎముకలు స్పెషలిస్ట్ డాక్టర్ చలువాధి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఎక్కువ క్యాల్షియం ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. ఎముకలు పటుత్వంగా ఉండేందుకు చేపలు, గుడ్డు, పాలు తీసుకోవాలని తెలిపారు. సభ అనంతరం ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ముద్ద నా నాగేశ్వరావు చేతుల మీదగా డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని సన్మానం చేసి అభినందనందించారు. హాస్ప‌ట‌ల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ తెల్ల కార్డు ఉన్నవారికి షుగర్ వ్యాధికి, ఎముకల సంబంచిన వ్యాధులకు, చెవి, ముక్కు, గొంతు సమస్యలకు, జనరల్ సర్జరీ వ్యాధులకు ఉచిత ఒపి, ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ ప‌థ‌కాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు.