చీరాల : ఏప్రిల్ 27, 28తేదీల్లో విశాఖపట్టణంలో రాష్ట్ర సైబర్ సెక్యురిటీ సమ్మిట్ నిర్వహించారు. పోటీల్లో ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో మొదటి బహుమతులు సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. విశాఖ నోవాటెల్ హోటల్‌లో జరిగిన సమ్మిట్‌లో 13జిల్లాల నుండి 341టీములు పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. వీటిలో 41టీములు ఫైనల్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. తమకళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విద్యార్ధులు ప్రధమ స్థానంలో నిలిచినట్లు హెచ్ఒడి డాక్టర్ పి హరిణి తెలిపారు. తమకళాశాల విద్యార్ధులతోపాటు తిరుపతి ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ విద్యార్ధులు ఉమ్మడిగా ప్రధమ బహుమతి రూ.80వేలు సాధించికున్నట్లు తెలిపారు. బహుమతిని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌బాబు అందజేశారు. ఐటి అడ్వైజర్ జెఎ చౌదరి ప్రశంసా పత్రాలు అందజేశారు.
కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం విద్యార్ధులు ఎన్ కిరణ్‌కుమార్, ఆర్ హారిక, వి నాగసౌజన్య, ఎస్‌కె హర్షద్, వై భాను వెంకట వైష్ణవ్ పోటీల్లో విజేతలుగా నిలిచారు. వీరు ప్రభుత్వ వెబ్‌సైట్‌లైన ఈ ప్రగతి, మీ కోసం, ప్రజాసాధికార సర్వే వెంబ్‌సైట్లను పరిశీలించి అందులోని లోపాలు గుర్తించి సరిచేసేందుకు సలహాలు ఇచ్చినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో కంప్యూటర్ సైన్స్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు ఎం నవ్యశ్రీ, పి బాలాజి, జివినయ్, టి కావ్యశ్రీ, పి త్రిపుర మొదటి బహుమతి రూ.6వేలు సాధించికున్నారు. బహుమతులు సాధించిన విద్యార్ధులను అభినందించారు.