చీరాల : ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒమెగా హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్త ఎఆర్, మెడికల్ కోడర్ ఉద్యోగాల కోసం బిటెక్, బిఫార్మసీ ఆఖరి సంవత్సరం విద్యార్ధులకు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. ఎంపికల్లో తమ కళాశాల విద్యార్దులు 15మంది ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. సెలక్షన్స్‌కు 42మంది విద్యార్ధులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. తొలుతు కంపెనీ ప్రతినిధులు కంపెనీ వివరాలు విద్యార్ధులకు చెప్పారు. 2004లో ప్రారంభమైన కంపెనీలో ప్రస్తుతం 12వేలమందికిపైగా పనిచేస్తున్నారని చెప్పారు.
చెన్నై, బెంగుళూరు, తిరుచ్చి, హైదరాబాద్, భీమవరంలో శాఖలున్నాయన్నారు. కంపెనీ వ్యాపారం, ఉద్యోగుల విధులు, బాధ్యతలు వివరించారు. ఎఆర్ కాలర్స్‌గా ఎంపికైన వాళ్లు ఇన్సూరెన్స్ కంపెనీకి హాస్పిటల్స్‌కు సమన్వయకర్తలుగా పనిచేస్తారని చెప్పారు. సెలక్షన్స్‌కు హాజరైన 42మందిలో 40మంది గ్రూప్‌డిస్కషన్స్‌కు ఎంపికైనట్లు తెలిపారు. వీరిలో 15మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్ధులకు ట్రైనింగ్ అనంతరం సంవత్సరానికి రూ.2.09లక్షలు జీతం, ఇతర అలవెన్స్‌లు ఇస్తారని కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్ధులను అభినందించారు.