అమరావతి : నేతల వాతావరణం చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైందా అన్నట్లుగా ఉంది. కర్ణాటకలో ఎన్నికలు, ప్రచారం జరుగుతుంటే ఆంధ్రాలో ఎన్నికలు జరుగుతున్నంత ప్రచారం మీడియా చేస్తుంది. కర్ణాటక ఎన్నికలకు ఆంధ్రకు సంబంధం ఏమిటి? ఎందుకంత ప్రచారం జరుగుతోందని అందరిలోనూ ఉదయిస్తున్న ప్రశ్న. కారణాలు చర్చకు వస్తున్నాయి.
– దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగినా గెలుపు మాదే అంటున్న బిజెపికి ఎదురుగాలి వీయడం
– 55లక్షల మంది తెలుగు ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది.
– భావోద్వేగాలను రెచ్చగొడుతూ మోడీ ప్రచారం
– ఓటేస్తే ఏమి చేస్తారనే అజెండా, మేనిఫెస్టో కూడా లేని బీజేపీ
– దేశవ్యాప్తంగా బిజెపి అధికారానికి వచ్చాక అసహనం, దళితులు, మైనారిటీలపై దాడులు
– నోట్ల రద్దుతో ప్రజలకు నగదు కష్టాలు
– గత ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేయడం.
ఇలా అనేక ప్రశ్నలకు బిజెపి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో మోడీ ప్రచారం అంతా భావోద్వేగాలతోనే జరిగింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తోందని ప్రచారం చేసుకుని బయటపడ్డారు. యూపీలోను హిందు సెంటిమెంటును సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడు కర్ణాటకలోను ఆడేటారహాలో దళితులను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కర్ణాటకలో టీడీపీకుడా బిజెపిని ఓడించాలని తెలుగు ప్రజలకు సూచించింది. బిజెపి మొసాంన్ని ఎండగడుతుంది. నిజాయితీకి, దేశభక్తి మోడీ ప్రతిరూపంగా చెప్పుకుంటున్న బిజెపి గాలి జనార్దన్ కుటుంబానికి 8సీట్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల బాధ్యతలు గాలికి అప్పగించడంపై సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. చివరికి ఎన్నికలు నాలుగు రోజుల దగ్గరకు వచ్చినా మేనిఫెస్టో కూడా ప్రకటించలేని స్థితిలో ఉంది గెలుపు మాత్రం తమదేనని బుకాయించడం విడ్డురంగా ఉంది. ఏది ఏమైనా కర్ణాటక ప్రజల తీర్పు దేశ రాజకీయాలని, 2019 జాతీయ ఎన్నికలను ప్రభావితం చేయ నున్నాయి. జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాలు వేదిక కానున్నాయి.