Home విద్య అంతర్జాతీయ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు ఎంపికైన సెయింట్ ఆన్స్ అధ్యాపకుడు

అంతర్జాతీయ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు ఎంపికైన సెయింట్ ఆన్స్ అధ్యాపకుడు

458
0

చీరాల : ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీ ఈసిఈ అధ్యాపకుడు ఎ త్రినాథరావు అంతర్జాతీయ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు.

ఏపీ స్కిల్ డవలెప్మెంట్ కార్పొరేషన్ ద్వారా విశాఖపట్నంలోని విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆవరణలో ఇండో యూనివెర్షల్ కోలాబరేషన్ ఫర్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఇంజినీరింగ్ ఎదుకేటర్ వర్కుషాప్ లో జరిగిన ఎంపికలో తమ కళాశాల ఈసిఈ అధ్యాపకుడు త్రినాథరావు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పొగడదండ రవికుమార్ తెలిపారు. 700మంది అధ్యాపకులు హాజరైన వర్కుషాప్ లో తమ కళాశాల అధ్యాపకుడు ఎంపిక కావడం ఆనందంగా ఉందని హెచ్ఓడి డాక్టర్ కే జగదీష్ బాబు పేర్కొన్నారు.