చీరాల : విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే శ్రీ గౌతమి విద్యా సంస్థల లక్ష్యమని కళాశాల డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు (ఎంవి) అన్నారు. స్థానిక శ్రీ గౌతమీ కళాశాల్లో పూర్వ విద్యార్థుల అభినందన సభ ఆదివారం నిర్వహించారు. 2021- 23 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలో అత్యధిక మార్కులతో ప్రతిభ కనబరిచిన పది మంది విద్యరులను అభినదించారు. తమ కళాశాల్లో చదివిన విద్యార్థుల్లో 10మంది ప్రతిభ పురస్కారానికి ఎంపికవటం ఎంతో గర్వకారణం అన్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.58వేలు చొప్పున నాలుగేళ్ల పాటు వస్తాయని తెలిపారు. ప్రస్తుతం వీరందరు వివిధ కళాశాలల్లో ఇంజనీరింగ్ చదువుతున్నారని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అవార్డు గ్రహీతలైన విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులు సాధించడానికి తోడ్పడిన అధ్యాపకుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్‌వి శ్యామ్ ప్రసాద్, గణిత అధ్యాపకులు టివిఎల్ఎన్, కెమిస్ట్రీ అధ్యాపకులు వరప్రసాద్, ఎంఎస్ కాలేజీ డైరెక్టర్ కెవి, ఎఒ శ్రీనివాస్ పాల్గొన్నారు.