చీరాల (DN5 News) : చీరాల, వాడరేవు సముద్ర తీరంలో పర్యాటక రంగం అభివృద్దిలో భాగంగా పర్యాటకుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బోట్లను ఉగాధి సందర్భంగా శాసన సభ్యులు ఎంఎం కొండయ్య, తెలుగుదేశం నియోజకవర్గ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ ట్రయల్ రన్ చేశారు. కొద్దిసేపు సముద్రంలో బోట్లపై సందడి చేశారు. యువతను ఉత్సాహపర్చారు.






