Home ఆంధ్రప్రదేశ్ సామజిక న్యాయం టిడిపితోనే సాధ్యం : దాసరి రాజా మాష్టారు

సామజిక న్యాయం టిడిపితోనే సాధ్యం : దాసరి రాజా మాష్టారు

441
0

కందుకూరు : నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు సామజిక న్యాయం పాటించడం వల్లనే టిడిపిలో అన్ని సామజిక వర్గాలకు ప్రాదాన్యత లభిస్తుందని, దానికి ఉదాహరణగా మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగని చెప్పుకోవచ్చని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణ శిభిరం డైరెక్టర్ దాసరి రాజా మాష్టారు అన్నారు. కందుకూరు తెలుగువిజయం ప్రాంగణంలో జరుగుతున్న 155 బాచ్ ముగింపు కార్యక్రమంలో బాగంగా మాజీ లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాజా మాష్టారు మాట్లాడుతూ ఒక్క బాలయోగి గారే కాదు, యస్సి సామజిక వర్గాలలో కావలి ప్రతిభ భారతి, గుమ్మడి కుతూహలమ్మ, మొతుకుపల్లి నరసింహులు, కడియం శ్రీహరి, జేఆర్ పుష్పరాజ్, నక్క ఆనందబాబు, పీతల సుజాత, జవహర్, రావెల కిశోర్‌ బాబు వంటివారికి, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలలో నాయకత్వాన్ని పెంచి సామజిక న్యాయానికి నిదర్శ‌నం గా నిలిచిన ఘనత టిడిపికే దక్కుతుందని అన్నారు. పార్టీ ఆలోచనలకు అనుగుణంగా యావత్ యంత్రాంగం కులమతాలకు అతీతంగా అందరిని కలుపుకుంటూ పార్టీ కార్యక్రమాలను చంద్రబాబునాయుడు ఆదేశానుసారం క్రమశిక్షణతో నిర్వహించాలని కోరారు.

రానున్న సాధారణ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తిరిగి టిడిపికి పట్టం కట్టేవిధంగా సంక్షేమ పధకాల అమలులో బాగస్వాములు కావాలని అభిలషించారు. పార్టీలో పనిచేస్తూ ఉంటె అధికార పదవులు వాటంతట అవే కష్టపడేవారికి దక్కుతాయన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటి శాఖమాత్యులు నారా లోకేష్‌బాబు ఈ అంశంలో నిరంతర కసరత్తు చేస్తున్నారని అన్నారు. అనంతరం వివిధ‌ పోటీలలో విజేతలకు బహుమతులు అంద‌జేశారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సర్టిఫికెట్స్ అందజేసారు. శిక్షణకు గుంటూరు జిల్లా వేమూరు, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాల నుండి గ్రామ, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కందుకూరు జెడ్‌పిటిసి సభ్యులు కంచర్ల శ్రీకాంత్, కో ఆర్డినేటర్ కాకర్ల మల్లికార్జున్, శిక్షకులు పాపారావు పసుపులేటి, చైతన్య, పరమేశ్వరరెడ్డి పాల్గొన్నారు.