బాపట్ల : మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని రూరల్ యస్ఐ గళ్ళ రవికృష్ణ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.