చీరాల : వైఎ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో మహిళా సంరోణ – చర్యలు అంశంపై జిల్లా స్థాయి సెమినార్ నిర్వహించారు. సెమినార్‌కు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ రమణమ్మ అధ్యక్షత వహించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్ధులకు వివిధ అంశాలను వివరించారు. మహిళలపై వేధింపులు – చట్టాలు వివరించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. సెమినార్ అనంతరం విద్యార్ధులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్ధులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిఆర్‌సి సభ్యులు డి ధాత్రికుమారి, ఎం సంతోషికుమారి, లవకుమార్ పాల్గొన్నారు.