Home విద్య వెన్నెముక స‌మ‌స్య‌ల‌పై కామాక్షి కేర్ హాస్పిట‌ల్‌లో స‌ద‌స్సు

వెన్నెముక స‌మ‌స్య‌ల‌పై కామాక్షి కేర్ హాస్పిట‌ల్‌లో స‌ద‌స్సు

463
0

చీరాల : కామాక్షి కేర్ హాస్పిట‌ల్ ఆవ‌ర‌ణ‌లో శనివారం జ‌రిగిన సెమినార్‌లో డాక్ట‌ర్ గోలి వెంక‌ట సుబ్బారావు రోగుల‌కు సూచ‌న‌లు ఇచ్చారు. వెన్నుపూస నొప్పితో బాధ‌ప‌డేవాళ్లు నిటారుగా కూర్చోవాల‌ని సూచించారు. కింద కూర్చోకూడ‌ద‌ని చెప్పారు. మోకాళ్లు న‌డుము భాగంకంటే ఎక్కువ ఎత్తులో ఉండ‌కూడ‌ద‌న్నారు. అధిక బ‌రువు ఉన్న‌వాళ్లు బ‌రువు త‌గ్గ‌డం ద్వారా వెన్నుపూస‌మీద వ‌త్త‌డి త‌గ్గుతుంద‌న్నారు. వెన్నుపూలోని డిస్కులు అరిగిపోవ‌డం, డిస్క్‌లు ప‌క్క‌కు తిర‌గ‌డం వ‌ల్ల అక్క‌డున్న న‌రాలకు త‌గ‌ల‌డం వ‌ల్ల ఎక్కువ నొప్పి వ‌స్తుంటుంద‌న్నారు. అలాంటి వారికి కొత్త‌గా వ‌చ్చిన ప‌రిక‌రాల ద్వ‌రా వెన్నెముక ఆప‌రేష‌న్లు చేసి డిస్కుల‌ను స‌రిచేయ‌వ‌చ్చ‌న్నారు. కొత్త కొత్త ప‌రిక‌రాలు ఇప్పుడిప్పుడే ముందుకు వ‌స్తున్నాయ‌న్నారు.

డాక్ట‌ర్ గోలి సుబ్బారావుకు జన్యుమార్పిడి చికిత్స‌, విజ‌య‌వంతం కావ‌డం వ‌ల‌న అసోసియేష‌న్ ఆఫ్ స్పైన్ స‌ర్జ‌న్ అవార్డు అంద‌జేసిన‌ట్లు వైద్య‌శాల మేనేజింగ్ డైరెక్ట‌ర్‌ తాడివ‌ల‌స దేవ‌రాజు తెలిపారు. ఈసంద‌ర్భంగా అవార్డు అందుకున్న సుబ్బారావును మున్సిప‌ల్ మాజీ ఛైర్మ‌న్ అందె క‌స్తూరిభాయి, రాజ్‌కుమార్ అభినందించారు. అనంత‌రం సుబ్బారావును ఘ‌నంగా స‌న్మానించారు. సుబ్బారావు ప‌ద్మ‌శాలీయ వంశానికి చెందిన‌వాడు కావ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. శివాల‌యం అభివృద్దికి క‌మిటి స‌భ్యులు పొన్నూరు రామారావు మాట్లాడారు. డాక్ట‌ర్ సుబ్బారావుకు గ‌తంలో చీరాల‌లో ప‌నిచేసిన అనుభ‌వం ఉంద‌న్నారు. మ‌ళ్లీ ఇప్పుడు ప్ర‌తినెలా వ‌చ్చి వైద్య‌సేవ‌లందించాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో డాక్ట‌ర్ చ‌లువాది వెంక‌టేష్‌, డాక్ట‌ర్ పి సురేష్‌, హాస్పిట‌ల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ తాడివ‌ల‌స దేవ‌రాజు, మేనేజ‌ర్ తాడివ‌ల‌స సురేష్ స‌న్మానించారు. గ్లో ఫౌండేష‌న్ స‌భ్యులు, రోట‌రీ క్ల‌బ్ ప్ర‌తినిధులు పోలుదాసు రామ‌కృష్ణ‌, మామిడాల శ్రీ‌నివాస్‌, గోపు శ్రీ‌నివాస‌రావు, ఎన్ శ్రీ‌నివాస‌రావు పాల్గొన్నారు.