Home ప్రకాశం ప్రణాళికా బద్దంగా చదివితే ఎలాంటి ఆందోళన ఉండదు

ప్రణాళికా బద్దంగా చదివితే ఎలాంటి ఆందోళన ఉండదు

453
0

చీరాల :  శ్రీగౌతమి కాలేజీలో జరిగిన సదస్సులో డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఏ విధంగా పరీక్షల వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకోవాలో వివరించారు. విద్యార్థులు పరీక్షలకు ప్రణాళిక వేసుకొని చదువుకోవడం ద్వారా మార్కులు సంపాదించవచ్చని అన్నారు. పాఠ్యాంశాలు అర్థం చేసుకోవడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు గమ్యంపై ఆసక్తి కలిగి ఉండాలన్నారు. ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలని, చక్కటి ప్రణాళిక కలిగి ఉండాలని పేర్కొన్నారు. సులభమైన పద్దతి ద్వారా నేర్చుకుంటూ ఆశావాద దృక్పథం కలిగి ఉండాలని సూచించారు.

శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ విద్యార్థులు మానసిక వత్తిడిని తగ్గించుకోవాలంటే రాత్రిపూట భోజనం పదింటలోపు చేసి నిద్ర పోవాలన్నారు. తెల్లవారు జామున నిద్ర లేచి చదువు కోవడం ద్వారా మానసిక వత్తిడి తగ్గుతుందన్నారు. పాఠాలు చదివేటప్పుడు ఇష్టంగా చదవాలని కష్టంగా చదవకూడదని తెలిపారు. విద్యార్థులు చదువు తోపాటు క్విజ్, వ్యాసరచన డిబేటింగ్ వంటి పోటీ పరీక్షలలో పాల్గొనడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు తెలిపారు. క్లాసులో టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు ధ్యాసంతా టీచర్ చెప్పే వాటిమీద ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గౌతమి విద్యా సంస్థల అధినేత వెంకటేశ్వర్లు, టి రవీంద్ర, ప్రిన్సిపాల్ గౌతమీ జూనియర్ కాలేజ్ ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.