చీరాల : ప్రభుత్వ పాఠశాలలపట్ల విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరిగిందని సీనియర్ కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ అన్నారు. ఎన్ఆర్ అండ్ పిఎం ఉన్నత పాఠశాల విద్యార్ధులకు ఉచితంగా బ్యాగులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా పాఠశాల ఆవరణలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రేణు టెక్నాలజీస్ సహకారంతో పుస్తక సంచులను పంపిణీ చేశారు. పాఠశాలను ఆధునీకరించి ప్రవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ఎంఎల్ె, మున్సిపల్ ఛైర్మన్ రమేష్‌బాబు చేస్తున్న కృషికి దాతలు, పూర్వవిద్యార్ధులు చేదోడుగా నిలవడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ విద్యకి మహర్ధశరావడం ఖాయమన్నారు. విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్పారు. రేణు టెక్నాలజీస్ ఎండి పొన్నూరి రవికుమార్ మాట్లాడుతూ పాఠశాలకు ముందురోజుల్లో మరింత సహకారం అందిస్తామని తెలిపారు. ఉచిత వైఫైతో కూడిన ఇంటర్‌నెట్ వెంటనే కల్పిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆలూరి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, కృష్ణమోహన్, పవని భానుచంద్రమూర్తి, పివి సాయిబాబు, వై సాల్మన్‌రాజు, జి రమేష్, దయాసాగర్, రేణు సంస్థ ప్రతిని పి గిరి పాల్గొన్నారు.