Home ప్రకాశం స్మశాన స్థలం, పశువుల చెరువును కాపాడాలని కలెక్టర్కు వినతి

స్మశాన స్థలం, పశువుల చెరువును కాపాడాలని కలెక్టర్కు వినతి

207
0

చీరాల  : గవిని వారి పాలెం పంచాయితీ పచ్చ మొగిలి గ్రామానికి చెందిన 50 సెంట్లు స్మశాన భూమి, 62 1/2 సెంట్లు  పశువుల చెరువు భూమిని  ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన మాజీ సర్పంచ్ భర్త అక్కల అంకయ్య నుండి కాపాడాలని పచ్చ మొగిలి గ్రామస్తులు ఎం చేనవేరారెడ్డి, ఏ వెంకటరెడ్డి, ఎం సుబ్బారెడ్డి తదితరులు  బాపట్ల కలెక్టర్కు  స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి కుమారుడు పెద అంకిరెడ్డి తన సొంత భూమి 50 సెంట్లు గ్రామ పెద్దలు కుమ్మర ఎర్ర వెంకటేశ్వర్లు, మరుపోలు రామస్వామి రెడ్డి, కోటా వెంకటేశ్వర్లు రెడ్డి, మరుపోలు చినపోలి రెడ్డి, నాయుడు తిరుపతిరెడ్డి, అక్కల కోటేశ్వర్ రెడ్డి, పిట్టు సుబ్బారెడ్డి, ఆట్ల జాలి రెడ్డి, మించాల వెంకటేశ్వర్లు రెడ్డి 1997లో గ్రామ స్మశానానికి నాలుగు వేలకు విక్రయించారని వినతి పత్రంలో పేర్కొన్నారు. అప్పటినుండి ఆ స్థలాన్ని స్మశాన స్థలంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. సర్వే నంబర్ 456/4లో 62 1/2 సెంట్లు భూమిని పశువుల చెరువుకు రాయించి ఇచ్చారని తెలిపారు. గ్రామ ప్రజల అవసరం కోసం స్మశానం, పశువుల తాగునీటి చెరువు కోసం స్థలం కేటాయించిన  గ్రామానికి చెందిన అక్కల పెద్ద అంకిరెడ్డికి  గ్రామ ప్రజలు రుణపడి ఉన్నట్లు పేర్కొన్నారు.

గత 20 రోజులుగా గ్రామంలో రాజకీయ ప్రయోజనం కోసం ప్రజలను రెండు ముఠాలుగా విడగొట్టి స్మశాన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు మాజీ సర్పంచి భర్త అక్కల అంకయ్య ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. గ్రామ స్మశాన స్థలంను చదును చేసి వరి నారు పోసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. పశువుల చెరువును ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. అతని బారి నుండి స్మశాన స్థలం, పశువుల చెరువును కాపాడాలని వేడుకున్నారు.