న్యూయార్క్(ఇంటర్నెట్) : దేశంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారుల్లో రిలయన్స్ జియో వినియోగదారులే ఎక్కువ మంది ఉన్నారు. ఈ విషయం మనం చెబుతుంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా రూ.7వేల కోట్లపైగా వార్షిక ఆదాయం ఉండే కంపిణీలపై జరిపిన సర్వేలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది.
పురుడుపోసుకున్న 22నెలల్లో 21.5కోట్లమంది వినియోగదారులను సంపాదించుకున్న జియో దేశంలో సాంకేతిక విప్లవం సృష్టించి అరుదైన గుర్తింపు పొందింది. ఒకప్పుడు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు భారత్ ఆమడ దూరంలో ఉండే దేశాన్ని మూడేళ్ల క్రితం పురుడుపోసుకున్న రిలయన్స్ జియో సాంకేతిక విప్లవం సృష్టించినడంలో సందేహం లేదు. అందుకే ఫార్చ్యూన్ రూపొందించిన ‘ఛేంజ్ ది వరల్డ్’ జాబితాలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. ఇంటర్నెట్ పొందడం మానవుడి ప్రాథమిక హక్కుగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన నేపథ్యంలో రిలయన్స్ జియో దీన్ని అమలు చేయడంలో విజయం సాధించిందని ఫార్చ్యూన్ ప్రకటించింది.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో సంస్థ భారత్‌కు డిజిటల్ ఆక్సిజన్ అందించిందని పేర్కొంది. రిలయన్స్ జియో, మెర్క్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇండిటెక్స్, అలీబాబా గ్రూప్ మొదటి ఐదు స్థానాల్లో ఉండగా క్రోజర్, జైలెమ్, ఏబీబీ, వెయిట్ వాచర్స్ ఇంటర్నేషనల్, హ్యూస్ నెట్‌వర్క్ సిస్టమ్స్ తరువాత ఐ దు స్థానాల్లో ఉన్నట్లు ప్రకటించింది. ప్రపంచానికి కొత్త ఆలోచనలు సూచించడం, సామాజిక సమస్యల పరిష్కారం అంశాలను పరిగణనలోకి తీసుకుని సర్వే చేసినట్లు ఫార్చూన్ సంస్థ ప్రకటించింది.