Home ప్రకాశం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే నాణ్య‌మైన చ‌దువులు

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోనే నాణ్య‌మైన చ‌దువులు

418
0

చీరాల : ప్రభుత్వ బడుల్లోనే నాణ్య‌మైన‌ విద్య అందుతుంద‌ని ఆదినారాయ‌ణ‌పురం ఉన్న‌త పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు భ‌వ‌నం బ‌ద్రిరెడ్డి పేర్కొన్నారు. చీరాల ప‌ట్ట‌ణం ఆదినారాయణపురం ఎఆర్ ఉన్నత పాఠశాలలో 48వ వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్ధుల వీడ్కోలు కార్య‌క్ర‌మం గురువారం పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించారు.

ఈసంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో విశ్రాంత ఉపవిద్యాశాఖ అధికారి వై.వెంకటేశ్వర రెడ్డి, విశ్రాంత ఎంఇఒ జంగా మోహనరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ బత్తుల బ్రహ్మారెడ్డి విద్యార్ధుల‌నుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హ‌త క‌లిగిన ఉపాధ్యాయుల‌తో నాణ్య‌మైన‌ విద్య అందుతుందన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నా, ప్రభుత్వ ప్రోత్సాహం లేక పోయినా, 12 సంవత్సరాలుగా నియామకాలపై ప్రభుత్వం నిషేదం విధించిన‌ప్ప‌టికీ ఉత్త‌మ ఫ‌లితాలు సాధిస్తున్న‌ట్లు చెప్పారు.

అధిక పనిభారమైనా ఆత్మ విశ్వాసంతో ఉపాధ్యాయులు పని చేస్తున్నారని చెప్పారు. అందుకు గ‌త ఆరేళ్లుగా విద్యార్ధులు సాధిస్తున్న ఫ‌లితాలే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఉపాద్యాయుల ఆద్వర్యంలో క్రమశిక్షణ, ఒత్తిడిలేని, ఆట పాటలతో విలువలతోకూడిన‌ విద్యను అందిస్తున్న‌ట్లు చెప్పారు. బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కోరారు. ప్రభుత్వ పధకాలైన ఉచిత విద్య పాఠ్యపుస్తకాలు, ఏకరూపదుస్తులు, ఉపకార వేతనాలు, బాలికలకు సైకిళ్ళు మద్యాహ్న భోజన వసతి, గాలి వెలుతురులతో కూడిన విశాలమైన తరగతి గదులు, ఆటస్థలము, బాలబాలికలకు ప్రత్యేక యూరినల్స్ , టాయిలెట్స్ సదుపాయం, దూరం ప్రాంతల వారికి ఉచిత బస్ పాస్ లాంటి సౌకర్యాలను వినియోగించు కోవాలని అన్నారు.

అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎపిటిజి జిల్లా అధ్యక్షులు బి నాగమల్లేశ్వర రావు, ఎస్ఎఆర్ఆర్ఎం పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు కె వీరాంజనేయులు, గవినివారిపాలెం ప్ర‌ధానోపాధ్యాయులు జి పిచ్చిరెడ్డి, ఎస్ఎంసి ఛైర్మన్ వి అమర్లింగయ్య, వెంకటరావు, పుష్పరాజు, శ్రీనివాసులరెడ్డి, రామాంజనీదేవి, శ్రీనివాసరావు ప్రాధమిక పాఠశాల హెచ్ఎం యం బాలుడు, ధనలక్ష్మి, హజరత్ పాల్గొన్నారు