చీరాల : నియోజకవర్గంలోని బీసీలు ఆధారణ2 కింద దరకాస్తూ చేసుకున్నవారు రుణాలకు త్వరగా డీడీలు తీయాలని బిసి కార్పొరేషన్ ఈడి నాగేశ్వరరావు కోరారు. చీరాల ఎంపిడివో కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆదరణ రుణాలు కోసం అర్జీలు పెట్టుకున్న వారు లబ్దిదారుని వాటా 10% శాతం డిడి తీయాల్సి ఉందన్నారు. కొద్దిమంది మాత్రమే డిడిలు తీశారని చెప్పారు. మిగిలిన వాళ్లు ఈ నెల 28 లోపు డీడీలు తీయాలని చెప్పారు. తియ్యని అభ్యర్థులకు బదులు కొత్త అభ్యర్ధులను తీసుకుంటామన్నారు. ఆదరణ రుణాలు తీసుకున్న ప్రతి అభ్యర్థి బిసి కార్పొరేషన్లో రుణాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడివో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.