చీరాల : ప్రజా ఉద్యమాలకు చైతన్యం, ఉత్సాహం నింపేది కళారంగమని జేవివి జిల్లా కార్యదర్శి ఏవి పుల్లారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి జివి కొండారెడ్డి పేర్కొన్నారు. ప్రజానాట్యమండలి జిల్లా శిక్షణాతరగతులు ప్రారంభం సందర్భంగా ఐఎల్టీడీ ఫెడరేషన్ కార్యాలయంలో జరిగిన సభలో మాట్లాడారు. మూడు రోజులపాటు శిక్షణా తరగతులు జరుగనున్నాయి.
ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను పాటలు, నాటికలు వంటి కళారూపాలతో ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు కళాకారులు వారధులన్నారు. సామాజిక రుగ్మతలపై కళాకారులు చైతన్యం చేయాలన్నారు. సభలో ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు ఉబ్బా కోటేశ్వరరావు, నాయకులు పి సురేష్, బి పేతురు, ఐఎల్టీడీ ఫెడరేషన్ బ్రాంచ్ కార్యదర్శి గోసాల సుధాకర్ పాల్గొన్నారు.