చీరాల : రాజకీయ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ దేవరపల్లి రంగారావు సోమవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం నుండి చీరాల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరపల్లి యువజన ఆధ్వర్యంలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలతో యువత, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు దేవరపల్లితో పాదయాత్రలో చీరాల వరకు నడిచివచ్చారు. పాదయాత్ర అనంతరం తహశీల్దార్ ఎం వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి దామర్ల శ్రీకృష్ణ, ఎన్ మోహనకుమార్ ధర్మ, నాయకులు పాల్గొన్నారు.