ఇంటర్నెట్ (ఉత్తరప్రదేశ్) : కన్న కూతుర్ని హత్యచేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని చౌదర్‌పూర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తారా అనే ఆరేళ్ల బాలిక అనారోగ్యంతో బాధపడుతుంది. కాళ్లు వంకర్లు పోతున్నాయి. ఎంత వైద్యం చేయించినా జబ్బు నయం కాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రలు తాంత్రికుడిని ఆశ్రయించారటన. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యంతో ఉన్న తారాను చంపి ఇంట్లో పాతిపెట్టాలని చెప్పడంతో ఊపిరి ఆడకుండా చేసి చంపి ఇంట్లోనే పాతిపెట్టారు. రోజు కనిపించే పాప విషయంలో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారించిన పోలీసులు ఇంట్లో తవ్వడంతో మృతదేహం బయటపడింది.
‘పాపకు ఎన్నో మందులు వాడాము, అవేవీ పనిచేయలేదు. అంతేకాకుండా ఇంకా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. నా మనవడికి కూడా ఎముకలు వంకర్లు పోయే వ్యాధి వచ్చింది’అని తార బామ్మ వెల్లడించారు. తారకు పోషకాహార లోపంతో పాటు ఎముకలు వంకర్లు తిరిగే వ్యాధి ఉన్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. పాప తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.