Home బాపట్ల మచ్చలేని స్వచ్ఛమైన నేత ఎమ్మెల్యే ఏలూరి 

మచ్చలేని స్వచ్ఛమైన నేత ఎమ్మెల్యే ఏలూరి 

19
0

పర్చూరు : మచ్చలేని రాజకీయ నేతగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారని, ఎప్పుడు ఎనర్జిటిక్ గా, ఉత్సాహంగా పనిచేస్తుంటారని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పేదల సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ఏలూరి ఒక మంచి నాయకత్వ పటిమ గల నాయకుడని కొనియాడారు. సమర్థవంతమైన నేతగా ఎమ్మెల్యే ఏలూరి నాయకులు, కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగించారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తూ సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడంలో ఎమ్మెల్యే ఏలూరి విజయవంతంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

సమర్థవంతమైన నాయకులు ఉన్నచోట పెద్ద ఎత్తున మెజారిటీ వస్తుంది. దానికి ఎమ్మెల్యే ఏలూరి ఉదాహరణ అన్నారు. పర్చూరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం కంచుకోటగా సాంబశివరావు మార్చాడని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో పనిచేసుకుంటూ వెళ్ళమని చెప్పానని పనిచేసుకుంటూ ప్రజలతో నాయకులతో మమేకమై సమర్థతను నిరూపించుకున్నారు. ఆ తర్వాత వెను తిరిగి చూడలేదు. నా నమ్మకాన్ని నిలబెట్టాడనీ మూడుసార్లు విజేతగా నిలిచాడని పేర్కొన్నారు. యువ నేతలను తయారు చేయడంలో ఉత్సాహంగా పనిచేయడంలో ఏలూరి ఆదర్శం అన్నారు. ఎప్పుడు నియోజకవర్గ సమస్యలపై పెద్ద ఫైలు తీసుకొని వస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటాడని చంద్రబాబు పేర్కొన్నారు. ఏలూరి అడిగిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తనదని, పరిష్కరిస్తానని ప్రకటించారు. సాంబశివరావు మరెన్నో విజయాలు సాధించాలి. ఎప్పుడు అండగా ఉంటానని చంద్రబాబు పేర్కొన్నారు. మృతి చెందిన పద్మ కుటుంబానికి తనతో పాటు పూర్తి సహకారం అందించారని ఆ కుటుంబానికి అండగా నిలిచాడన్నారు.